Header Banner

ఈ ఆలయంలో నైవేద్యంగా మాంసాహారం పెడతారు! ఎక్కడో తెలుసా?

  Sun Feb 16, 2025 17:12        Devotional

ప్రతి గ్రామంలో కొలిచే అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు. దాదాపు ప్రతి గ్రామంలో, గ్రామ శివార్లలో నూకాలమ్మ అమ్మవారి ఆలయం తప్పకుండా ఉంటుంది. ఏ కార్యక్రమం ప్రారంభించినా ప్రతి ఇంటిలో ముందుగా నూకాలమ్మ వారిని పూజించడం సర్వసాధారణం. రైతులు తమ పొలంలో వ్యవసాయ పనులు ప్రారంభించినప్పటి నుండి విత్తనాలు జల్లడం, పంటకోయడం, పంటను ఇంటికి తీసుకురావడం వరకు ప్రతి కార్యక్రమం ముందు నూకాలమ్మ అమ్మవారిని పూజించడం పరిపాటి. అక్కడ నైవేద్యంగా శాకాహార నైవేద్యాలు పెడతారు కానీ ఇక్కడ మాంసం హారం నైవేద్యంగా పెడతారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామ శివారులో ఉన్న నూకలమ్మ 1969 సంవత్సరంలో అనపర్తి నుంచి జంగారెడ్డిగూడెం వలస వచ్చిన రాజుల కుటుంబం ఊరు నుంచి తీసుకు వచ్చి జంగారెడ్డిగూడెం లో విగ్రహం ప్రతిష్ట చేసింది. 100 సంవత్సరాలు ఆలయానికి చరిత్ర ఉంది. 

 

గ్రామాలలో నూకాలమ్మ అమ్మవారిని పూజా విధానంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొందరు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు తమ తమ ఇళ్లలో ఈశాన్యం మూలాన పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి నూకాలమ్మ అమ్మవారిగా భావిస్తూ బూరెలు, గారెలు, పరమాన్నం వండి కోళ్ళు, మేకలను నైవేద్యంగా ఉంచి మొక్కు తీర్చుకుంటారు. అమ్మవారి నైవేద్యంలో మాంసాహారం తప్పనిసరిగా ఉంటుంది. 

 

ఇది కూడా చదవండి: మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా.. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గిరిజన ప్రాంతాలలో నూకాలమ్మ అమ్మవారి ఆలయాలు లేనిచోట్ల కొయ్యలను అమ్మవారిగా చెక్కి భూమిలో పాతి పూజిస్తుంటారు. గిరిజనులు తప్పనిసరిగా తమ మొక్కులను ఆ కొయ్యతో తయారు చేసిన నూకాలమ్మ అమ్మవారి వద్దనే తీర్చుకుంటారు. గిరిజన ప్రాంతాలలో ప్రజలు కోళ్ళు, మేకలనే కాకుండా పందులు, దున్నలను కూడా అమ్మవారికి మొక్కులుగా చెల్లించి ఆ మాంసాన్ని వండి తమ బంధువులకు భోజనాలలో వడ్డించడం ఆనవాయితీ. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో బంధువులకు పెట్టే భోజనాలు తప్పనిసరిగా మాంసాహారమే ఉంటుంది. 

 

అందుకే భక్తులు కోర్కెలు తీర్చే తల్లిగా విరాజిల్లుతుందని లోకల్ 18తో పంచుకున్నారు ఆలయ బోర్డు మెంబర్ రాంబాబు. అమ్మ వారికి అత్యంత వైభవోపేతంగా ప్రతీ పౌర్ణమికి క్రమం తప్పకుండా ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ''చండీహోమం'' నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ మాఘపౌర్ణమిని పురస్కరించుకుని 72వ చండీ హోమం జరుగుతుందని, ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే విగ్రహం ఏకశిలగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలు కూడా తీర్చే తల్లిగా విరాజిల్లుతుంది. ఆలయ కళ్యాణకళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీజలాలు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం , సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Devotional #Temples #NonVeg #Prasadam